- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అమరావతి పట్ల అలసత్వం వద్దు : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

X
దిశ, ఏపీ బ్యూరో: అమరావతిపట్ల రాష్ట్రప్రభుత్వం అలసత్వం పనికిరాదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. రాజధాని అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆలయాల సందర్శన అనే కార్యక్రమాన్ని తాళ్లాయపాలెంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో కంపెనీలు పెట్టేందుకు అనేక సంస్థలు స్థలాలు తీసుకున్నాయని అవి ఇప్పటికి ప్రారంభించలేదన్నారు. ఆ సంస్థలు పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రతి ఏటా తప్పనిసరిగా కౌలు చెల్లించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
Next Story