- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారు, పతంగిని నమ్ముకుని మోసపోవద్దు : రేవంత్ రెడ్డి
దిశ,తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని, నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని కాంగ్రెసే అని మైనార్టీలు గుర్తించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ పేర్కొన్నారు. ఇందిరా పార్క్ వద్ద శనివారం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో మైనార్టీ గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కారునో, పతంగినో నమ్ముకుంటే మోసపోయేది మైనార్టీలే అని త్రిబుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించింది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. మోడీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు.
చట్ట సభలో కాంగ్రెస్ కి 200 మంది ఎంపీలు ఉంటే ఇలాంటి చట్టాలను తెచ్చే ధైర్యం మోది చేసేవారా అని అన్నారు. అసద్ చెప్పారని మైనార్టీలంతా కారుకే ఓటు వేశారని, మరి త్రిబుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా రంజిత్ రెడ్డి ఎలా ఓటు వేస్తారన్నారు. మైనార్టీలంతా ఓసారి ఆలోచించాలని సూచించారు. రాష్ట్రంలో దళితుల కంటే ముస్లింలు వెనుకబడ్డారని, ముస్లింలకు కూడా రూ.10లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వీరికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తే దాదాపు 30వేల ఉద్యోగాలు వచ్చేవని పేర్కొన్నారు.
రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. మైనార్టీల పక్షాన కాంగ్రెస్ చేస్తున్న పోరాటం మొదలైందని, కేసీఆర్‌ని గద్దె దించే వరకూ మా పోరాటం ఆగదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, బీజేపీ మతతత్వ రాజకీయాలతో లబ్ధి పొందుతుందన్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మైనార్టీలు టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని, వీరంతా గల్లీలో కుస్తీ చేసినట్లు నటించి ఢిల్లీలో దోస్తీ చేస్తారని విమర్శించారు.
ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దగాకు గురయ్యాయన్నారు. వెంటనే మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుసేన్, యూత్ నాయకులు అనిల్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితారావ్ , మైనారిటీ సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.