- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అలెక్సా’తో హ్యాపీ దివాళీ.. ట్రై చేసి చూడండి!
దిశ, ఫీచర్స్ : వర్చువల్ అసిస్టెంట్ అలెక్సా ఇప్పటికే రోజువారీ పనులను మెరుగైన మార్గంలో నిర్వహించడంలో మనకు సహాయపడుతోంది. టీవీ, సౌండ్ సిస్టమ్‌లు వంటి మీడియా పరికరాలను నియంత్రించడంతో పాటు ఏసీలు, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్, గీజర్స్, వాషింగ్ మెషిన్స్ వంటి గృహోపకరణాలను ఒక్క క్లిక్‌తో కంట్రోల్ చేసేస్తోంది. ఇక ప్రస్తుతం దీపావళి పండుగ రాబోతున్న వేళ ఇంటి చుట్టూ ఉన్న లైటింగ్ కంట్రోల్ చేసేందుకు కూడా ఉపయోగపడనుంది. అంతేకాకుండా దీపావళి కౌంట్‌డౌన్, దీపావళి ఎందుకు జరుపుకుంటారు? దివాళీ ప్రత్యేక పూజలు ఎలా చేస్తారు? అనే వివరాలతో పాటు పండుగ స్పెషల్ రెసిపీలు కూడా అందిస్తోంది. లెట్స్ ట్రై!
దీపావళి కౌంట్ డౌన్
అమెజాన్ అలెక్సాతో ‘దీపావళికి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి?’ అని అడగ్గానే టక్కున సమాధానం చెప్పేస్తుంది. అందుకు తగినట్లుగా దీపావళికి కౌంట్‌డౌన్ ప్రారంభించండి. ఇంటికి అవసరమైన అలకంరణ, పూజా సామగ్రి, పువ్వులను మార్కెట్ నుంచి తెచ్చుకునేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.
దీపావళి గురించి అలెక్సాకు తెలుసా?
మీకు ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే.. దీపావళిని జరుపుకోవడం వెనుక ఉన్న కథను మీ పిల్లలకు తెలియజేయడానికి కూడా అలెక్సాను యూజ్ చేసుకోవచ్చు. అలెక్సాను రామాయణాన్ని వివరించమని అడిగితే.. ఆ పనీ చేసిపెడతుంది. ఇక ‘అలెక్సా, దీపావళి ఎందుకు జరుపుకుంటారు?’ అని ప్రశ్నించినా.. దివాళి గొప్పతనాన్ని వివరిస్తుంది.
గ్రీన్ దీపావళి!
దీపావళి పండుగని పర్యావరణ అనుకూలంగా జరుపుకోవాలని ప్రకృతి ప్రేమికులు కొన్నేళ్ల నుంచి ప్రచారం చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే మార్కెట్లో గ్రీన్ క్రాకర్స్ కూడా వచ్చాయి. వీటి నుంచి తక్కువ కాలుష్యం వెలువడుతుంది. ఇక సాధారణ టపాసులతో అధిక కాలుష్యం వెలువడుతుండగా ముఖ్యంగా నార్త్‌లో ఇది సమస్యగా మారింది. ఇందుకు దీపావళిని ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవాలంటే అలెక్సా ఉత్తమ మార్గం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా.. ‘అలెక్సా, ఫైర్ క్రాకర్స్ పేల్చండి’ లేదా ‘అలెక్సా, దీపావళి క్రాకర్ గేమ్ ప్రారంభించండి’ అని చెప్పడమే!
అలెక్సాతో దీపావళి పూజ
దివాళీ అంటే ఇంటిని అలంకరించడం, పటాకులు పేల్చడం మాత్రమే కాదు. ఆ రోజు పవిత్రంగా చేసే లక్ష్మీ పూజ అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి. ఇందుకోసం ‘అలెక్సా, లక్ష్మీ పూజ ముహూర్తం ఎప్పుడు?’ లేదా ‘అలెక్సా దీపావళి పూజ ప్రారంభించండి’ అని చెప్పగానే చేసేస్తుంది.
డెలీషియస్ ట్రీట్
భారతదేశంలో పండుగలంటే వివిధ రకాల రుచికరమైన వంటకాలు గుర్తుకు రాకమానవు. దీపావళి ఇందుకు మినహాయింపేం కాదు. అలెక్సాతో ఇంట్లో వివిధ వంటకాలతో కూడా ప్రయోగాలు చేయవచ్చు. ఇందుకోసం ‘అలెక్సా, దీపావళి స్పెషల్ రెసిపీస్’ అని చెప్పండి.. ఇంట్లో అద్భుతమైన ట్రీట్‌లను తయారు చేసుకుంటూ ఆనందించండి.