- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బాస్ విన్నర్ తనే.. రన్నరప్స్‌కు ఆ షోలో ఛాన్స్
దిశ, సినిమా: బిగ్ బాస్ ఓటీటీ 2021 గ్రాండ్ ఫినాలే ముగిసింది. ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించిన రియాలిటీ షో టైటిల్‌ను దివ్య అగర్వాల్ గెలుచుకోగా.. నిషాంత్ భట్, షమితా శెట్టి ఫస్ట్ అండ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఈ మేరకు బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ.25 లక్షల క్యాష్ ప్రైజ్ అందుకుంది దివ్య. ఇక ఈ షోలో టాప్ ఫైనలిస్టులుగా మిగిలిన కంటెస్టెంట్లు అక్టోబర్‌లో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 15లో పాల్గొననున్నారు.
14 సక్సెస్‌ఫుల్ సీజన్ల తర్వాత ఫస్ట్ టైమ్ వూట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై 24×7 లైవ్‌తో కొత్త ఫార్మాట్‌లో రన్ అయిన ఓటీటీ రియాలిటీ షో.. ఆరు వారాలపాటు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్ పంచడంలో సక్సెస్ అయింది. కాగా షమితా శెట్టి, రాకేష్ బాపట్ రొమాన్స్ ఈ సీజన్‌కు అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక టైటిల్ గెలుచుకున్న దివ్య అగర్వాల్.. తన విజయాన్ని క్లోజ్ ఫ్రెండ్స్‌తో పాటు బాయ్‌ఫ్రెండ్ వరుణ్ సూద్‌తో సెలబ్రేట్ చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పార్టీ వీడియోలో వరుణ్.. దివ్యను గట్టిగా హత్తుకుని అభినందిస్తుండగా, తను సోఫాలో కూర్చుని కేక్ కట్ చేసింది.