తేనెటీగల దాడిలో ఇంజినీర్ మృతి..

by Sumithra |
తేనెటీగల దాడిలో ఇంజినీర్ మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్ :

శ్రీశైలం రిజర్వాయర్‌ వద్ద విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్ కెనాల్ డివిజనల్ ఇంజినీర్ భానుప్రకాశ్‌ మృతి చెందారు. కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్‌ వద్ద విధుల్లో ఉన్న ఆయనపై మంగళవారం ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేసింది.

పెద్ద ఎత్తున తేనెటీగలు దాడి చేయడంతో భానుప్రకాశ్‌ ప్రాణాలు విడిచారు. ఇదిలాఉండగా, గతనెలలో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో 9మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


Advertisement
Next Story

Most Viewed