- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దయాగుణం చాటిన వైద్యాధికారి
దిశ, సూర్యాపేట: సూర్యాపేట రురల్ ప్రాంతంలో గల సెవెన్ స్టార్ హోటల్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రూరు గ్రామంలోని తమ పంట పొలాలకు వెళ్లి, బైక్‌పై తిరిగి వస్తుండగా చంద్రన్నకుంట గ్రామానికి చెందిన అంజయ్య, అతని సొదరి మల్లమ్మ బైక్ అదుపుతప్పి పడిపోవడంతో, మల్లమ్మ గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ సమయంలో అటుగా వస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కర్పూరం హర్షవర్ధన్ వెంటనే కారు ఆపి, వారిని లేవదీసి, స్వయంగా తన కారులో తీసుకెళ్లి స్థానిక సూర్యాపేట ఆసుపత్రిలో చేర్పించారు.
అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తమకు చేసిన సాయం పట్ల బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం సాటి మనిషిగా ప్రతిఒక్కరి కర్తవ్యం అని గుర్తు చేశారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది పోలీస్ కేసుల గురించి భయపడతారని, ఇప్పటి చట్టం ప్రజలను ఇబ్బందులకు గురి చేయదని ప్రతిఒక్కరూ వెంటనే స్పందించాలని కోరారు.