‘ఆ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు’

by  |
‘ఆ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు’
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని చెరువు భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ హెచ్చిరించారు. మంగళవారం కుర్రన్నపేట్ చెరువు కంచె (బండ్)ఏర్పాటు పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని చెరువుల భూమును ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. శిఖం భూముల సరిహద్దులను గుర్తించి రికార్డులలో నమోదు చేయాలనీ, దశలవారీగా ప్రతి చెరువుకు కంచె (బండ్) ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎల్లపల్లి గ్రామ ప్రకృతి వనం ఏర్పాటు స్థలం పరిశీలించారు.

జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో చేపట్టిన ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 6601 ఇండ్లు మంజూరు కాగా , అందులో నిర్మల్ నియోజకవర్గంలో 3761, ముధోల్ నియోజకవర్గంలో 2240, ఖానాపూర్ నియోజకవర్గంలో 600 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. నిర్మాణ పనుల వివరాలను ఎప్పటికప్పుడూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.


Next Story

Most Viewed