- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శేరిలింగంపల్లిలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ టోకెన్ల పంపిణీ
by Shyam |

X
దిశ, శేరిలింగంపల్లి : కరోనా కట్టడి కోసం ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొవిడ్ టీకా వేసుకోవాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం డివిజన్ పరిధిలోని సూపర్ స్ప్రెడర్లు అయిన కూరగాయలు, పండ్లు, మాంసం, చికెన్, విక్రయదారులు, వీధి వ్యాపారులు, సెలూన్ షాప్‌లు, కిరాణ షాపుల్లో పనిచేసే వారికి, వివిధ రకాల వ్యాపారులకు కరోనా టీకాలకు సంబంధించిన టోకెన్‌లను లింగంపల్లి మున్సిపల్ మార్కెట్‌లో నాగేందర్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ వీరేశం గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఖాజా పాషా తదితరులు పాల్గొన్నారు.
Next Story