81.49లక్షల మందికి రేషన్ పంపిణీ: మారెడ్డి

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో తెల్లరేషన్ కార్డుదారులకు ఇస్తున్న ఉచిత బియ్యాన్ని 93శాతం పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 81.49 లక్షలమంది లబ్దిదారులకు 3లక్షల 25వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేశామన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. వరుసగా 3నెలల రేషన్ తీసుకోకుండా ఏప్రిల్‌లో రేషన్ తీసుకున్న లబ్దిదారులకు ఏప్రిల్, మే నెలకు సంబంధించిన రూ. 1500 ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. ఏప్రిల్‌లో 74.07 లక్షలు, మే నెలలో 74.35లక్షల మంది లబ్దిదారులకు నేరుగా రూ.2,227కోట్లు, బ్యాంకు ఖాతాలేని వారికి పోస్టాఫీస్‌ ద్వారా రూ.158.24కోట్లు అందజేశామన్నారు.

Advertisement

Next Story