- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రవ్యాప్తంగా కూలీలకు భోజనం పంపిణీ
దిశ, కరీంనగర్: విద్యాబుద్దులు నేర్పడమే కాదు సమాజ శ్రేయస్సు కోసం తమవంతు బాధ్యతగా నిర్వర్తించి అందరికీ ఆదర్శంగా నిలవాలని భావిస్తోంది ట్రస్మా. ఇందుకోసం తమవంతు సాయం చేయాలని నిర్ణయించిన ట్రస్మా రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ల ఆధ్వర్యంలో కూలీలకు భోజనం అందించాలని నిర్ణయించింది. పంచాయతీల పరిధిలో అయితే సర్పంచులు, పట్టణాల్లో అయితే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సాయంతో వలస కూలీల జాబితా సేకరించి భోజనం అందించాలని భావించింది. ఈ మేరకు ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ల యాజమన్యాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించే దిశగా ముందుకు సాగుతున్నామని శేఖర్ రావు చెప్పారు. రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే చాలా జిల్లాల నుంచి సానుకూల స్పందన వస్తోందని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ట్రస్మా సభ్యత్వ పాఠాశాలల్లో భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్డడించారు.
tags : Distribution, meals, laborers, throughout, state, trasma, karimnagar