కల్వకుర్తిలో అనాథలకు పండ్ల పంపిణీ

by Sridhar Babu |
Kalvakurthi-1
X

దిశ, కల్వకుర్తి: తెలంగాణ రాష్ట్ర కేటీఆర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు ఏంఏ ముజీబ్ ఆదేశాల మేరకు శనివారం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు అంకు సురేందర్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలోని కుర్మిద్ద రోడ్ లోని పీబీఎస్ అనాథ ఆశ్రమంలో వృద్ధులకు బియ్యం, కిరాణా సామాగ్రి, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేవా సమితి నాయకులు మీసాల జంగయ్య, మందుల బల్ నారాయణ, పరమేష్, భాను, జిల్లా జాగృతి విద్యార్ధి విభాగం అధ్యక్షులు దారమొని గణేష్, మాల మహానాడు రావుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story