- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మార్పీఎస్ నిత్యావసరాల పంపిణీ

X
దిశ, వరంగల్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మార్పీఎస్ నాయకులు అండగా నిలిచారు. ఎమ్మార్పీఎస్ ఖిలావరంగల్ మండల ఇన్‌ఛార్జ్ సింగారపు చిరంజీవి ఆధ్వర్యంలో శనివారం కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఖిలావరంగల్ మండలం, శుంభునిపేట పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంద కుమార్ మాదిగ, జిల్లా ఇన్‌ఛార్జులు భండారి సురేందర్, జన్ను దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story