‘కరోనా నియంత్రణలో తెలంగాణే ఫస్ట్’

by Shyam |
‘కరోనా నియంత్రణలో తెలంగాణే ఫస్ట్’
X

దిశ, మెదక్: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని టీఎస్ ఐఐసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, రాష్ర్ట పౌర సరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం లాక్‌డౌన్ కాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 1500 ముస్లిం, 100 జర్నలిస్టుల, 20 అర్చక కుటుంబాలకు బాలమల్లు సోదరులు గ్యాదరి కరాటే బాల్‌రాజ్ జ్ఞాపకార్థం కరుణ క్రాంతి ఫౌండేషన్ ద్వారా మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో లాక్‌డౌన్‌తో పాటు కర్ఫ్యూ, క్వారంటైన్ టైన్, కంటోన్మెంట్ ఇతరత్రా పకడ్బందీ చర్యలు కఠినంగా తీసుకున్న ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నియంత్రణలో ఉన్నాయన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలు ఇలాగే ప్రభుత్వానికి సహకరించాలని బాలమల్లు, శ్రీనివాస్ రెడ్డిలు కోరారు.

Advertisement

Next Story

Most Viewed