రాష్ట్రంలో మూడు రోజులు వడగాళ్ల వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

by Anjali |
రాష్ట్రంలో మూడు రోజులు వడగాళ్ల వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజమాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జయశంకర్, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వడగళ్ల వానలకు అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రైతులకు అధిక పంట నష్టం జరిగింది. మిగిలిన పంటను రక్షించుకునేలా జాగ్రత్తలు తీసుకోని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.



Next Story

Most Viewed