బీజేపీలో ముసలం.. భగ్గుమన్న అసమ్మతి

by Aamani |
BJP
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: భైంసా బల్దియా బీజేపీలో ముసలం మొదలైంది.. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి, అసమ్మతి మరోసారి భగ్గుమంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో మొదలైన వర్గపోరు ఇటీవల తారాస్థాయికి చేరింది. తాజాగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కపిల్ సింధే రాజీనామాతో బయటపడింది.. కౌన్సిలర్లకు కపిల్ సింధేకు మధ్య మొదటి నుంచీ సఖ్యత లేకపోగా, కొన్నిరోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. బల్దియాలో అవినీతి, అక్రమాలను ఫ్లోర్ లీడర్ ప్రశ్నించడం లేదని, పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని కౌన్సిలర్లు, బీజేపీ పట్టణ, జిల్లా అధ్యక్షురాలు పేర్కొంటుండగా, మొదటి నుంచీ కౌన్సిలర్లు తన వెంట కలిసి రావడం లేదని పట్టణ, జిల్లా అధ్యక్షురాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫ్లోర్ లీడర్ పేర్కొంటున్నారు.

సగం స్థానాల్లో పోటీపై విమర్శలు

ఫ్లోర్ లీడర్ కపిల్ సింధే రాజీనామాతో భైంసా బీజేపీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులుండగా.. బీజేపీ 13 వార్డులకే పోటీ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇక బల్దియా దక్కించుకోవాలంటే కనీసం 14 స్థానాలు తప్పని సరి. అలాంటిది 13 వార్డులకే పోటీ పెట్టడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 13 వార్డులకు పోటీ చేస్తే.. 9 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో రెండు చోట్ల కూడా బీజేపీ అనుకూలురులే గెలుపొందారు. వాస్తవానికి అన్ని స్థానాలకు పోటీ చేస్తే.. బల్దియా తప్పకుండా తమ ఖాతాలో పడేదని బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. అలాంటి చోట మున్సిపాలిటీలో గౌరవప్రదమైన కౌన్సిలర్ స్థానాలు దక్కినా.. మొదటి నుంచీ వివాదాలకు కేంద్రంగా మారింది.

మొదటి నుంచీ సఖ్యత కరువు

మొదటి నుంచీ ఫ్లోర్ లీడర్​కపిల్ సింధేకు, మిగతా కౌన్సిలర్లకు మధ్య సఖ్యత లేదు. ఇటీవల దుర్గా నవరాత్రి ఉత్సవాల సమయంలో మొరం విషయంలో ఫ్లోర్ లీడర్, పట్టణాధ్యక్షుడికి మధ్య వివాదం నెలకొంది. మున్సిపాలిటీ సాక్షిగా వీరిద్దరూ గొడవపడగా.. సీసీ కెమెరాలో రికార్డు అయిన విజువల్స్ వైరల్ గా మారాయి. భైంసా మున్సిపాలిటీలో లేఅవుట్ అనుమతుల్లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లు వెంచర్లు వేస్తున్నారని బీజేపీ నాయకులు ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనుల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. ఆటోనగర్ రోడ్డులో 100 గజాలకో గ్యాప్ ఇస్తే.. తహసీల్దారు ఆఫీసు నుంచి శీవాజీ చౌక్ వరకు గ్యాప్ పెట్టకుండా నిర్మించినా ఫ్లోర్ లీడర్ మున్సిపాలిటీలో ప్రశ్నించడం లేదని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో మున్సిపాలిటీలో రాత్రంతా నిరసన చేస్తే ఫ్లోర్ లీడర్ రాలేదని ఆరోపిస్తున్నారు.

పాలకపక్షానికి అనుకూలమా..?

బల్దియాలో అక్రమాలపై ఫ్లోర్ లీడర్ పోరాటం చేయకుండా పాలకపక్షానికి అనుకూలంగా ఉంటున్నారని, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ విషయంలో పట్టణ, జిల్లా అధ్యక్షురాలు జోక్యం చేసుకుంటున్నారని, తమకు సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని చెబుతున్నారు. పదవికి న్యాయం చేయలేకనే రాజీనామా చేశారని, ఈ విషయాన్ని పార్టీ కార్యాలయానికి చెప్పేశామని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ సుత్రావే తెలిపారు. మున్సిపాలిటీలో జరిగే అవినీతి, అక్రమాలపై ప్రశ్నించకుండా, ఒకే వార్డులో రూ.కోటి నిధులు పెడితే అడగడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి పేర్కొన్నారు. మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో చేపట్టిన నిరసనకు రాకుండా.. ఓ మహిళను కొడితే మేం రావొద్దని అన్నారని, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఫ్లోర్ లీడర్ మాట్లాడటం సరికాదన్నారు. పాలక పక్షం నాయకులకు అమ్ముడు పోయారని ఆరోపించారు.

Advertisement
Next Story