నిత్యావసరాల పంపిణీలో రసాభాస

by Sridhar Babu |   ( Updated:2023-12-17 14:21:11.0  )

దిశ‌, ఖ‌మ్మం: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా సుజాతనగర్ మండలం సింగభూపాలెంలో శ‌నివారం టీఆర్‌ఎస్ కార్య‌క‌ర్త‌ల ఆధ్వ‌ర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేప‌ట్టారు. అయితే అర్హులైన పేదలకు కాకుండా పార్టీ ప‌రంగా మాత్ర‌మే సరుకులు అంద‌జేస్తున్నార‌ని కొంత‌మంది ఆందోళ‌న‌కు దిగారు. ఈ క్ర‌మంలోనే గ్రామ‌స్తుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం అర్ధాంతరంగా ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed