- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురుడు పోయమంటే డబ్బులు డిమాండ్.. ‘దిశ’ రంగ ప్రవేశంతో..!
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రి పురిటి ఘోషకు నిలయంగా మారింది. ఇందుకు నిదర్శనం గురువారం జరిగిన ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. చుంచుపల్లి మండలం పెనగడప గ్రామానికి చెందిన శిరీష పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. కానీ, ఇక్కడ సిబ్బంది కనీస కనికరం చూపలేదు. సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని ఉచిత సలహా ఇచ్చారు. తీరా అక్కడి వెళ్లాక.. పాల్వంచ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది ఆపరేషన్ థియేటర్ పని చేయడం లేదని మళ్లీ కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రికి పంపించారు. వారి బాధను అదునుగా చేసుకున్న ప్రధాన ఆస్పత్రి వైద్యులు రూ. 13 వేలు ఇస్తే కానీ కాన్పు చెయ్యమని (ఏఎన్ఎం ) లక్ష్మితో బేరసారాలు ఆడించారు. విషయం తెలుసుకున్న ( దిశ ) రంగ ప్రవేశం చేయడంతో ఖంగుతిన్న వైద్య సిబ్బంది శిరీషకు డెలివరీ చేయగా పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇటు ప్రసూతి వైద్యురాలు, మరోవైపు (ఏ ఎన్ ఎం) లక్ష్మి సాటి ఆడవారి ఘోష అర్థం చేసుకోక పోగా కాసులకు కక్కుర్తి పడడం సిగ్గుచేటని పలువురు అభిప్రాయపడుతున్నారు. జరిగిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.