ఇద్దరికి సవాల్ విసిరిన దర్శకుడు

దిశ, వెబ్‌డెస్క్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులు పోటీ పడుతున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుతో ఇప్పటికే ప్రముఖ హీరోలు, హీరోయిన్లు మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో సింగర్ యం.యం. శ్రీలేఖ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన టాలీవుడ్ దర్శకుడు వి.యన్ ఆదిత్య బుధవారం మొక్కలు నాటారు. అనంతరం సినీ రచయిత చంద్రబోస్, దర్శకులు అవసరాల శ్రీనివాస్‌కు ఛాలెంజ్ విసిరారు. ఇటువంటి బృహత్కర కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‎కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Advertisement