మీ సమయాన్ని ఎక్కువగా అందుకు కేటాయించండి : త్రివిక్రమ్ శ్రీనివాస్

by Shyam |
Director Trivikram Srinivas
X

దిశ, శేరిలింగంపల్లి: జేఈఈతో పాటు ఇతర ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో నిపుణులైన రిసోనెన్స్‌-హైదరాబాద్‌ కళాశాల సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో రిసోఫెస్ట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్యుడీషియల్‌, నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ సభ్యురాలు జస్టిస్‌ టి.రజని, ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, రిసొనెన్స్‌ హైదరాబాద్‌ డైరెక్టర్‌ పూర్ణచంద్రరావులు పాల్గొన్నారు. అంతేగాకుండా.. ఈ ఫెస్ట్‌లో నగరంలోని వివిధ క్యాంపస్‌‌ల నుండి 3000 మందికి పైగా విద్యార్థులు హాజరై ఉత్సాహంగా ఆడిపాడారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ టి.రజని మాట్లాడుతూ.. ఒక తల్లిగా, న్యాయమూర్తిగా పిల్లల పెంపకం, పిల్లల ఎదుగుదల పట్ల తనకు ఎనలేని శ్రద్ధ ఉందన్నారు. నిందితుడు బోనులో నిలబడినప్పుడు ఒక పసిపిల్లవాడిగా చూడగలిగానన్నారు. మీ జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మీ ఆలోచనలను మెరుగుపరుస్తోందన్నారు. అనంతరం దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తనకు సినిమాలతో పాటు, ఫిజిక్స్‌ ఇష్టమని, వీలున్నంతవరకు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలని సూచించారు.

విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. సంతోషపెట్టే విజయాన్ని సాధించడం మీరు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. విద్యార్థులు తమ జీవితంలోని అత్యంత కీలకమైన పరీక్షకు మరింత ఉత్సాహంతో వెళ్లేందుకు ఈ ఉత్సవం ఒక అవకాశమని హైదరాబాద్‌ రిసోనెన్స్‌ డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు అన్నారు. వివిధ క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు సాయంత్రం వరకు పలు ప్రదర్శనలు ఇవ్వడంతో ఉత్సవం ఎంతో ఆనందంగా సాగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఆయా అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed