డైరెక్టర్ శంకర్‌కు ఊరట.. నెక్ట్స్ డైరోక్టియరల్‌పై స్టే విధించలేం : కోర్టు

by Jakkula Samataha |
డైరెక్టర్ శంకర్‌కు ఊరట.. నెక్ట్స్ డైరోక్టియరల్‌పై స్టే విధించలేం : కోర్టు
X

దిశ, సినిమా : ‘ఇండియన్ 2’ సినిమా విషయంలో డైరెక్టర్ శంకర్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఇతర సినిమాలకు డైరెక్ట్ చేయకుండా స్టే విధించాలని నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించగా..అలా చేయడం కుదరదని తీర్పునిచ్చింది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమాను ప్రాథమికంగా రూ.236 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించామని తెలిపిన లైకా ప్రొడక్షన్స్.. ఇప్పటి వరకు రూ.180 కోట్లు ఖర్చు పెట్టినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

డైరెక్టర్‌కు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఒప్పుకున్నామని, అందులో రూ.14 కోట్లు కూడా ఇచ్చేశామని తెలిపారు. అయితే ఇప్పుడు తమ సినిమాకు కాకుండా మరో సినిమాకు దర్శకత్వం ప్రారంభించబోతున్నారని, అందుకు అనుమతించరాదని కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు..మరో సినిమాకు శంకర్ డైరెక్షన్ చేయడంపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. దర్శకుడు శంకర్ ఈ మధ్యే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కాగా అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed