నీకింకా బుద్ధిరాలేదా..? సుమంత్ రెండో పెళ్లిపై వర్మ ఘాటు వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-07-28 07:45:53.0  )
నీకింకా బుద్ధిరాలేదా..? సుమంత్  రెండో పెళ్లిపై వర్మ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాటలకు ఒక్కోసారి హద్దులుండవు అనేది అందరికి తెలిసిందే. తనకు నచ్చని విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. ఇక వర్మకు ఈ ప్రేమలు, పెళ్లిళ్లు ఇష్టం లేదన్న మాట తెలిసిందే. ఇక ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు అంటే వర్మ ఊరికే ఉంటాడా..? వారికి జ్ఞానోదయం చేయడం మొదలుపెడతాడు. ప్రస్తుతం అక్కినేని హీరో సుమంత్ కి కూడా అలాగే చేసి నెట్టింట వైరల్ గా మారాడు. అక్కినేని హీరో సుమంత్ రెండవ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఒక వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం విదితమే.

తమ బంధువుల అమ్మాయి అయిన పవిత్రను సుమంత్ వివాహమాడుతున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇక తాజాగా ఈ వార్త పై వర్మ తనదైన శైలిలో స్పందించాడు. “ఒక్కసారి అయ్యాకా కూడా నీకు ఇంకా బుద్ది రాలేదా.. సుమంత్?.. నీ కర్మ.. ఆ పవిత్ర కర్మ అనుభవించండి.. ఒక పెళ్లే నూరేళ్ల పెంట అయితే.. రెండో పెళ్లేంటయ్యా స్వామి? నా మాట విని మానేయ్” అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా సుమంత్ భార్య పవిత్రకు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు. అయినా తప్పు మీది, సుమంత్ ది కాదని, దౌర్భాగ్యపు వ్యవస్థదని ట్వీట్ చేశారు. 2014 లో సుమంత్ ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకొని రెండేళ్లకే విభేదాల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed