ఈరోజు తేదీ నాకు ప్రత్యేకం: రాఘవేంద్రరావు

by Shyam |
ఈరోజు తేదీ నాకు ప్రత్యేకం: రాఘవేంద్రరావు
X

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు ఈరోజు తేదీతో ప్రత్యేక అనుబంధముంది. ఈ తేదీ రోజున ఆయన జీవితంలో జరిగిన విశేషాలను ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. వివరాల్లోకెళితే..1977 ఏప్రిల్ 28న అంటే ఇదే రోజు సరిగ్గా 43 ఏళ్ల కిందట డైరెక్టర్ రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘అడవి రాముడు’ విడుదలైంది. రామారావుతో ఆ తర్వాత రాఘవేంద్రరావు ఇంకా కొన్ని చిత్రాలు తీశారు. అయితే, అప్పటికీ ఉన్న రికార్డులన్నింటినీ ‘అడవి రాముడు’ తిరగరాసింది. ఈ సందర్భంగా అడవిరాముడు సినిమా విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ సినిమా నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్స్‌కు ఆ సినిమా దర్శకుడిగా ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు రాఘవేంద్రరావు.

అంతేగాకుండా ఈరోజు ఏప్రిల్ 28వ తేదీన 2017లో డైరెక్టర్ రాఘవేంద్రరావు సమర్పణలో జక్కన్న డైరెక్షన్‌లో వచ్చిన ‘బాహుబలి’ విడుదలైంది. ఈ చిత్రం తెలుగు పరిశ్రమకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, రానాతో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో పాటు కుటుంబ సభ్యలందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈరోజు తేదీ తనకు ఎప్పటికీ గుర్తుండిపోయేదని డైరెక్టర్ చెప్పారు. ఇదే రోజు కరోనా మహామ్మారి తుద ముట్టించడానికి వేదికగా మారాలని ఆశిస్తున్నాని రాఘవేంద్రరావు తెలిపారు.

Tags: director raghavendrarao, emotional attachment, today date, adavi ramudu, bahubali, jayaprada



Next Story

Most Viewed