నేను రెడీగా ఉన్నానంటున్న కార్తీక్

by Shyam |
నేను రెడీగా ఉన్నానంటున్న కార్తీక్
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కారణంగా రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహ క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కీపర్లు కావడంతో ఇప్పుడు కీపింగ్ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారని అందరిలో సందిగ్దత నెలకొన్నది. ఇదే సమయంలో దినేశ్ కార్తీక్ పెట్టిన ట్వీట్ అందరినీ నవ్విస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న దినేశ్ కార్తీక్ దానికి సంబంధించిన కిట్‌ ఫొటోను పెట్టి ‘జస్ట్ సేయింగ్’ అనే కొటేషన్ ట్వీట్ చేశాడు. టీమ్ ఇండియా కీపర్లు ఐసోలేషన్‌లో ఉన్నారు కాబట్టి తాను రెడీ అనే సంకేతాలు ఇస్తూ కార్తీక్ ఈ ట్వీట్ చేసినట్లు తెలిసిపోతున్నది.

సరిగ్గా సమయం చూసుకొని కార్తీక్ వేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా, టీమ్ ఇండియా తరపున పరిమిత ఓవర్ల వరల్డ్ కప్ ఆడాలని కార్తీక్ భావిస్తున్నాడు. రాబోయే రెండేళ్లలో జరుగనున్న టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్‌లలో ఏదో ఒక దానిలో తాను ఆడిన తర్వాతే రిటైర్ అవుతానని గతంలో చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో స్కై టీవీ తరపున కామెంటేటర్‌గా పని చేస్తున్నాడు. ఐపీఎల్‌కు ఇయాన్ మోర్గాన్ రాకపోతే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు దినేశ్ కార్తీక్ నేతృత్వం వహించే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story