- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దినేశ్ కార్తీక్-దీపిక పల్లికల్‌కు కవలలు
దిశ, స్పోర్ట్స్: భారత స్పోర్ట్స్ సెలెబ్రిటీ కపుల్ దినేశ్ కార్తీక్ – దీపిక పల్లికల్ జోడికి కవల పిల్లలు జన్మించారు. టీమ్ ఇండియా క్రికెటర్, కామెంటేటర్ అయిన దినేశ్ కార్తీక్.. స్క్వాష్ ప్లేయర్ అయిన దీపికను 2015లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగ కవలలు జన్మించినట్లు కార్తీక్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘మేం ముగ్గురం ఐదుగురం అయ్యాము’ అని కార్తీక్ పోస్టు పెట్టాడు. వారిద్దరికీ కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు.
కార్తీక్-దీపిక జంటకు అంతకు ముందు పిల్లలు ఎవరూ లేరు. కానీ తమ పెంపుడు కుక్కతో కలిపి ముగ్గురమని.. ఇప్పుడు పుట్టిన కవలలతో ఐదుగురం అయ్యామనే అర్థంలో ఆ పోస్టు పెట్టాడు. దినేశ్ కార్తీక్ ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అలాగే ఐసీసీ కామెంటరీ ప్యానలిస్టులో కూడా ఉన్నాడు. క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పకుండానే కామెంటేటర్ అయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక దీపిక పల్లికల్ ప్రపంచ స్క్వాష్ ర్యాంకింగ్స్‌లో టాస్ 10లో ప్రవేశించిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నది.