- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్తీక్ కామెంట్రీకి ఫిదా
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ దినేశ్ కార్తీక్ డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా అరంగేట్రం చేశాడు. అయితే ఈ సారి కామెంటేటర్‌గా కెరీర్ ప్రారంభించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోకుండానే స్కై స్పోర్ట్స్ కోసం కామెంట్రీ చెబుతున్నాడు. గురువారం నుంచి ప్రారంభమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కార్తీక్ కొత్త అవతారంలో కనిపించాడు. తొలి రోజు మ్యాచ్ వర్షం కారణంగా తుడిచి పెట్టుకొని పోయినా కొద్ది సేపు క్రికెట్ సంబంధిత విశేషాలు చెప్తూ అందరినీ ఆకట్టుకున్నాడు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్‌తో పంచ్‌లు వేస్తూ అందరినీ నవ్వించాడు. అభిమానులు కార్తీక్ సరదా మాటలకు ఫిదా అయిపోయి ఏకంగా మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దినేశ్ కార్తీక్‌ను ఇంగ్లాండ్-ఇండియా సిరీస్‌తోపాటు, 100 లీగ్ కోసం తీసుకున్నారు. అయితే స్కై స్పోర్ట్స్ అతడిని డబ్ల్యూటీసీ ఫైనల్ కామెంటరీ ప్యానల్‌లో కూడా పెట్టింది. దీంతో గురువారం నుంచి కొత్త బాధ్యతలు స్వీకరించాడు.