- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనుమరుగవుతున్న మినీ బస్టాండ్‌లు.. ప్రయాణీకులకు అవస్థలు
దిశ, బెజ్జూర్: తెలంగాణ ప్రభుత్వం, వన సంరక్షణ సమితిల ఆధ్వర్యంలో ఎజెన్సీలో బస్టాండ్‌లను అటవీ శాఖ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో బస్టాండ్‌లు శిథిలావస్థకు చేరుకున్నాయి. బెజ్జూర్ మండల పరధిలోని మర్తేడి, కుంతల మానేపల్లి, రెబ్బెన గ్రామాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మినీ బస్టాండ్‌లను 2001లో నిర్మించారు. అయితే, 20 సంవత్సరాలు గడుస్తున్నా మినీ బస్ స్టాండ్‌లపై అటవీశాఖ కన్నెత్తి చూడకపోవడంతో బస్టాండ్లు కనుమరుగైపోతున్నాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి.
బెజ్జూర్ రేంజ్‌లోనే మర్తేడి, కుంటల మానేపల్లి బస్టాండ్ శిథిలావస్థకు చేరుకోగా, రెబ్బెన బస్టాండ్ పూర్తిగా కనుమరుగైపోయింది. దీంతో ప్రయాణికులకు నిలువ నీడ లేకుండా పోయిందని బెజ్జూర్ మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మినీ బస్ స్టాండ్‌లకు మరమ్మతులు చేపట్టాల్సిందిగా మండల వాసులు కోరుతున్నారు. ఈ విషయమై బెజ్జూర్ రేంజ్ అధికారి దయాకర్‌ను సంప్రదించగా మినీ బస్ స్టాండ్ మరమ్మతుల కోసం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. నిధులు మంజూరు అయిన వెంటనే మరమ్మతులు చేపడతామని స్పష్టం చేశారు.