పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. భీమ్లా నాయక్ అప్‌డేట్ ఇదే..

by Shyam |   ( Updated:2021-12-21 01:44:08.0  )
Bheemla Nayak
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి వస్తుందంటే సినీ ప్రేమికుల సంబురాలు తారాస్థాయిలో ఉంటాయి. అదే రేంజ్‌లో వరుస సినిమాలు థియేటర్లలో సందడి చేస్తాయి. సంక్రాంతి బరిలో స్థానం కోసం స్టార్ హీరోలు అదే స్థాయిలో పోటీ పడుతుంటారు. టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి పోరు ఎంత కీలకమో అందరికీ తెలుసు. అందులో పోటీ అంటే ఆషామాషీ కాదు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ తన ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. పవన్ తాజా సినిమా ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరిలో ఉండగా, సంక్రాంతి అంతా మాదే అని కాలరెగరేసిన అభిమానులు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.

అందుకు సంక్రాంతి బరి నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకోవడమే కారణం. ఈ అప్‌డేట్‌తో పవర్ స్టార్ అభిమానులు కాస్త నిరాశ చెందినా.. త్వరలోనే ‘భీమ్లా నాయక్’ వస్తాడని మూవీ టీమ్ వారికి ఊరటనిచ్చింది. ఈ క్రమంలోనే ‘భీమ్లా నాయక్’ కోసం ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఓ త్యాగం చేశాని వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. భీమ్లా నాయక్ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నప్పటికీ సినిమా విడుదలను బాగా లేట్ చేయకూడదని మేకర్స్ భావించారట. అందుకోసమని దిల్ రాజు ఎఫ్3 విడుదలను వాయిదా వేశాడట. దీంతో ఫిబ్రవరిలో అందరినీ నవ్వించాలనుకున్న ఎఫ్3 ఏప్రిల్‌కు షిఫ్ట్ కాగా.. ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ రచ్చ చేయనున్నాడు.

ఇండియన్ కరెన్సీలో ‘జీరో’ నోటు.. మీకు తెలుసా?

Bheemlanayak

Advertisement

Next Story