- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డిజిటల్ ఇండియా ఓ లైఫ్ స్టైల్: మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రకటించిన ‘డిజిటల్ ఇండియా’ మిషన్ సర్కారు కార్యక్రమంగానే మిగిలిపోలేదని, నేడు అదొక లైఫ్ స్టైల్‌గా పరిణమించిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ గురువారం బెంగళూరులో టెక్ సదస్సు 2020ని ప్రారంభిస్తూ మాట్లాడారు. ‘డిజిటల్ ఇండియా మనదేశంలో మనిషి కేంద్రకంగా అభివృద్ధి చెందుతున్నది. దేశ పౌరుల జీవితాల్లో టెక్నాలజీ అనేక మార్పులు తీసుకొచ్చింది. ప్రతిఒక్కరూ టెక్ ఫలితాలు అనుభవిస్తున్నారు. డిజిటల్, టెక్ సొల్యూషన్స్‌కు మార్కెట్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైంది. టెక్నాలజీ ఫస్ట్ రూపంలోనే ప్రభుత్వ మాడల్ ఉన్నది’ అని వివరించారు.
కరోనా మహమ్మారి కాలంలో సాంకేతికత ప్రాధాన్యతను ఆయన ప్రస్తావించారు. లాక్‌డౌన్ తారాస్థాయిలో ఉన్నప్పుడు పేద ప్రజలందరికీ టెక్నాలజీ సహాయంతోనే సకాలంలో సహకారం అందించగలిగామని తెలిపారు. పారిశ్రామిక శకం నుంచి సమాచార శకానికి మధ్య మార్పులను వివరిస్తూ, ‘పారిశ్రామిక విజయాలు గతకాలపు అనుభవాలను మనముందుంచుతాయి. ప్రస్తుతం మనం సమాచార శకం మధ్యలో ఉన్నాం. కానీ, భవిష్యత్ మనం ఊహించినదాని కన్నా వేగంగా దూసుకొస్తున్నది. పారిశ్రామిక శకంలో మార్పులు క్రమపద్ధతిగా జరిగేవి. సమాచారంలో అలా ఉండబోదు. అప్పుడు ముందుగా కొత్తపథాన్ని తొక్కినవారు ముందుండేవారు. కానీ, ఇప్పుడు కాస్త వెనుకాముందైనా ఉత్తములే అగ్రశ్రేణిలో ఉంటారు’ అని అన్నారు.