అశ్విన్ గ్రేట్ బౌలర్ కాదన్న మంజ్రేకర్‌కు చాపెల్ కౌంటర్

by Shyam |
అశ్విన్ గ్రేట్ బౌలర్ కాదన్న మంజ్రేకర్‌కు చాపెల్ కౌంటర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంచి బౌలరే కానీ గ్రేటెస్ట్ మాత్రం కాదని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అన్నారు. అశ్విన్‌ను తాను ఆల్‌టైం గ్రేట్ బౌలర్లలో ఒకడిగా చూడలేను.. ఎందుకంటే అతడు ఇంకా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలో ఒక్కసారి కూడా ఐదు వికెట్ల ఘనతను సాధించలేదు అని మంజ్రేకర్ అన్నాడు. అశ్విన్ కేవలం ఇండియాలో తనకు అనుకూలమైన పిచ్‌లపై మాత్రమే చెలరేగిపోతాడు.. కానీ విదేశాల్లో మాత్రం వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు అని మంజ్రేకర్ చెప్పాడు. ఇండియాలో అశ్విన్‌కి పోటీగా రవీంద్ర జడేజా కూడా వికెట్లు తీస్తున్నాడు.. ఇక ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో అశ్విన్‌కు పోటీగా అక్షర్ పటేల్ వికెట్లు తీశాడని మంజ్రేకర్ గుర్తు చేశాడు.

కాగా, మంజ్రేకర్ వాదనతో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ విభేదించాడు. ఒక బౌలర్ ప్రతిభను ఐదు వికెట్ల హాల్‌తో నిర్దారించలేమని చాపెల్ అన్నాడు. ‘వెస్టిండీస్ బౌలర్ జోయల్ గార్నర్ ఆడే సమయంలో జట్టులో మరో ముగ్గురు అత్యుత్తమ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు. అంత మాత్రాన అతడిని గ్రేటెస్ట్ బౌలర్ అనకుండా ఉండగలమా? అశ్విన్ జట్టులో ప్రధాన బౌలర్ కాబట్టి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అతడిని టార్గెట్ చేసి ఆడారు. అదే సమయంలో అక్షర్ పటేల్ జట్టులోకి కొత్తగా వచ్చాడు కాబట్టి అతడి బౌలింగ్‌ను నిర్లక్ష్యం చేసి వికెట్లు పారేసుకున్నారు’ అని చాపెల్ అన్నాడు.

Advertisement

Next Story