డీజిల్ ధరలో స్వల్ప తగ్గుదల

దిశ, వెబ్‌డెస్క్ :

ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ తక్కువ ధరకు ట్రేడ్ అవుతున్న తరుణంలోనూ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మొన్నటి వరకు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెట్రోల్‌తో సామానంగా డీజిల్ రేట్లు పెరుగుతూ వచ్చింది.

అయితే, రోజువారీ సమీక్షలో భాగంగా చమురు సంస్థలు నాలుగు మెట్రో నగరాల్లో డీజిల్ ధరను 14-17పైసలు తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.73.40గా ఉండగా.. కోల్‌కత్తాలో రూ.76.90గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.85.50గా ఉండగా.. డీజిల్ ధర రూ.80.17గా కొనసాగుతోంది.

Advertisement