- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరోసారి హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
దిశ, ఏపీ బ్యూరో: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన అసైన్డ్ ఇళ్ల పట్టా భూముల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిరుపేద కుటుంబాలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలలో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకురు గ్రామంలో ఎస్సీ కుటుంబాలకు ఇచ్చిన భూముల్లో ప్రభుత్వం భవనాల నిర్మాణం చేపట్టింది.
దీన్ని నిరసిస్తూ గడ్డం చంద్రశేఖర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఇది చట్టవిరుద్ధమని వాదించారు. శ్రావణ్‌కుమార్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. నిరుపేద కుటుంబాలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలలో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు కోర్టు వాయిదా వేసింది.