- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎంసీ జాతీయ కార్యదర్శిగా దీదీ మేనల్లుడు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ జాతీయ కార్యదర్శిగా మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఎంపికయ్యారు. శనివారంనాడు జరిగిన రెండు పార్టీల వ్యవస్థాగత సమావేశాల అనంతరం టీఎంసీ నేత పార్థ చటర్జీ విలేకరులతో మాట్లాడారు. టీఎంసీ నేషనల్ జనరల్ సెక్రెటరీగా అభిషేక్ బెనర్జీని మమతా బెనర్జీ ప్రతిపాదించారని, పార్టీ నేతలు ఆమోదించారని వివరించారు. దీంతో అభిషేక్ బెనర్జీ, సుబ్రత బక్షి స్థానంలో వెళ్లనున్నారు. కాగా, పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్‌గా రాజకీయ నేతగా మారిన యాక్టర్ సయానీ ఘోష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒకరు ఒకే పదవిని చేపట్టాలన్న ప్రతిపాదనూ నేతలు ఆమోదించారని పార్థ వివరించారు. పార్టీలో అభిషేక్ బెనర్జీ ప్రాబల్యంగా వేగంగా పెరిగింది. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను ఒప్పించడంలో ఆయన సఫలమవ్వడం పార్టీకి లాభం చేకూర్చింది. టీఎంసీ అభిషేక్ డామినెన్స్ పెరుగుతున్నదనే పేర్కొంటూ పలువురు సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.