- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం పీఆర్వో విజయ్‌కి ఆ ఎమ్మెల్యే చెక్ పెట్టాడా..?
దిశ ప్రతినిధి, వరంగల్ : అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఎవరూ ఊహంచిన రీతిలో కోట్లు కూడబెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ పీఆర్వో గటిక విజయ్‌పై ప్రభుత్వ పెద్దలు కూపీ లాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టీఆర్ఎస్ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల విషయాల్లోనూ కలుగజేసుకోవడంపై గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్నట్లు చర్చ జరుగుతోంది. సంవత్సరం క్రితం వరంగల్ జిల్లాకు చెందిన, కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడుల్లో ఒకరైన ఓ ఎమ్మెల్యే పీఆర్వో వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. దీనిపై కేసీఆర్ సున్నితంగా హెచ్చరించి వదిలేసినా… ఆ తర్వాత షరా మాములుగానే తన వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ క్యాడర్‌ను నిర్మించుకునేందుకు యత్నించారన్నది ఓరుగల్లు నేతల మధ్య చర్చ జరుగుతోంది.
నేను ఎమ్మెల్యేను.. నన్నే డమ్మీ చేస్తాడా…?!
కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే స్థానంపై విజయ్ గురిపెట్టినట్లుగా కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సదరు ఎమ్మెల్యేకు తెలవకుండానే అక్కడి నేతలతో టచ్‌లో ఉండటం, ఎమ్మెల్యేకు ప్రత్యర్థులుగా ప్రచారంలో ఉన్న వారికి విజయ్ సన్నిహితంగా మెలిగారన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే ఓ దశలో సదరు ఎమ్మెల్యేను ఓవర్‌టెక్ చేసే స్థాయిలో విజయ్ ప్రభావం కనిపించిందని, నేను ఎమ్మెల్యేను… నన్ను డమ్మీని చేయాలనుకుంటున్నాడా..? తోలుతీస్తా అంటూ సదరు ఎమ్మెల్యే తన సన్నిహితుల వద్ద విజయ్‌పై ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది.
సంవత్సరం క్రితమే ఎస్‌బీ హెచ్చరిక…
పీఆర్వో విజయ్ వ్యవహారశైలి, పనితీరుపై ఇంటెలిజెన్స్ అధికారులు గతంలోనే ప్రభుత్వ పెద్దలను హెచ్చరించారంట. అయితే నిర్ధిష్టమైన ఆధారాలు లేకపోవడంతో చర్యలకు ఉపక్రమించలేదని సమాచారం. తాజాగా ఒక్కో వివాదం తెరపైకి రావడం, అందులో భాగంగానే ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ విజయ్‌పై వేటు వేశారన్న విశ్లేషణ ఓరుగల్లు రాజకీయాల్లో జరుగుతోంది.