- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రదర్ అనిల్ ను కలవలేదు.. పార్టీ మార్పుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఊపిరి ఉన్నంతవరకు టీఆర్ఎస్ పార్టీలో ఉంటానని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో మాపై తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోటస్ పాండ్ దగ్గర నిన్న బ్రదర్ అనిల్ ను కలిసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. 2016 లో ఒక్కసారి సమావేశానికి ముందు బ్రదర్ అనిల్ ను కలిసిన ఫోటో అది అని, నిన్న కలిసినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అబద్దాలు ప్రచారం చేశారని మండిపడ్డారు.
అసత్య వార్తలు రాసిన వారిని త్వరలోనే గుర్తించి వారిపై పరువునష్టం దావా వేయనున్నట్లు వెల్లడించారు. వై.ఎస్.ఆర్ కుటుంబానికి నాకు దగ్గర సంబంధం ఉన్న మాట వాస్తవమేనని, రాజకీయాలకు తీసుకొచ్చింది వైయస్ అయితే, రాజకీయ గుర్తింపు తెచ్చింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. నేనంటే పడని దళిత వ్యతిరేకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో సంతృప్తిగా ఉన్నట్లు ప్రకటించారు. పార్టీకి విధేయుడిగా ఉంటానని వెల్లడించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని వెల్లడించారు.
దళిత బంధుతో దళిత వర్గాలనే నిజంగా అభివృద్ధి చెందినట్లుగా ప్రకటించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు రెఫరెండంగా స్వాగతిస్తానని ప్రకటించారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో గణపురం నియోజకవర్గం నాలుగో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ సక్సెస్ కాలేదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళిత్ ఎంపవర్మెంట్ ను ప్రారంభించినట్లు తెలిపారు. బడ్జెట్లో వెయ్యి కోట్లు ప్రకటించాలని వెల్లడించిన రాజయ్య యూపీలో గాని ఇతర రాష్ట్రాల్లో గాని దళిత బంద్ ఉందా..? అని ప్రశ్నించారు. బీఎస్పీ దక్షిణ తెలంగాణలో సక్సెస్ కాదని ఆ పార్టీకి మనుగడ లేదని అన్నారు.