ఏటీఎం డిస్‌ప్లేకి కరోనా అంటించాడా?

by srinivas |
ఏటీఎం డిస్‌ప్లేకి కరోనా అంటించాడా?
X

కడప జిల్లా మైదుకూరులో ఒక యువకుడు చేసిన చేష్ఠ అందర్నీ ఆందోళనలో ముంచెత్తింది. దాని వివరాల్లోకి వెళ్తే… మైదుకూరులోని రాయల్ సర్కిల్‌లో ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. అక్కడ డబ్బులు తీసుకునేందుకు చాలా మంది వస్తుంటారు. దగ్గర్లోని గ్రామానికి చెందిన యువకుడు ఆ ఏటీఎంలోకి డబ్బులు విత్‌డ్రా చేసే నెపంతో వెళ్లి..ఆ ఏటీఎం మెషీన్ డిస్ప్లేపై లాలాజలాన్ని ఊసి, దానిపై ఉమ్మాడు. దీనిని గమనించిన స్థానికులు, దగ్గర్లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించగా 101 డిగ్రీల జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది. దీంతో అతనిని కడప రిమ్స్‌కు తరలించి, ఆ ఏటీఎంను మూసేసి ఉంచారు.

Tags: cudapa, maidukur, sbi atm, corona, spit at atm

Advertisement

Next Story