BIGG BOSS ఎఫెక్ట్.. సిరి, షణ్ను, దీప్తీ మధ్య ఏం జరుగుతోంది ?

by Anukaran |   ( Updated:2021-12-23 03:10:31.0  )
BIGG BOSS ఎఫెక్ట్.. సిరి, షణ్ను, దీప్తీ మధ్య ఏం జరుగుతోంది ?
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంత క్రేజ్‌తో అడుగు పెట్టాడు షణ్ను. యూట్యూబ్‌లో 4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న అతను బిగ్ బాస్ 5 విన్నర్ అవుతాడని చాలా మంది ఊహించారు. కానీ వారి ఊహలన్నీ తలకిందులు చేశాడు . సిరి మాయలో పడి టైటిల్ మరిచారో ఏమో.. హగ్గులు, కిస్సులతోనే గడిపేశాడు. హౌస్‌లో అందరిని చదివేసి తన లైఫ్‌లో ఉన్న దీప్తీ గురించి మరిచిపోయినట్టున్నాడు. అందుకే కాబోలు ప్రస్తుతం దీప్తీ, షణ్ను బ్రేకప్ అవుతున్నట్టు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్‌లో షణ్ను సిరి ప్రవర్తన చాలా మందికి నచ్చలేదు. జెస్సీ ఉన్నప్పుడు అంతగా ఫొకస్ కానీ వీరు జెస్సీ వెళ్లి పోయిన తర్వాత మాత్రం వీరిలో చాలా మార్పు వచ్చింది. ఇద్దరే మోజ్ రూంలో ఉంటూ హగ్గులు, కిస్సులతో నెగిటివిటి సంపాదించుకున్నారు.

సిరి వాళ్ల అమ్మ వచ్చి చెప్పిన తర్వాత కూడా ఇద్దరిలో మార్పు రాలేదు. ఇక షణ్ను కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా మళ్లీ అదే దారిలో వెళ్లారు. ఇక ఇద్దరికీ బయట లవర్స్ ఉన్నారు అయినా ఎక్కడో సిరితో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నాను అని షణ్ను చెప్పడం, అలాగే సిరి కూడా నాకు తెలియదు ఎందుకో ఇద్దరికి కనెక్షన్ వస్తుంది అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే బిగ్ బాస్ రన్నర్‌గా షణ్ముకు మిగలడంతో అందరూ సిరి వల్లే రన్నర్‌గా నిలుచారు అంటూ ముచ్చటిస్తున్నారు. అలాగే బిగ్ బాస్ బజ్‌లో కూడా అరియాన మీరు రన్నర్‌గా నిలవడానికి సిరినే కారణమా అంటే అవును అని చెప్పడం గమనార్హం. ఇక సిరి,షణ్నుకు బయట ఎంతో నెగిటివిటీ ఫాం అయ్యింది. హౌస్‌లో వీరి ప్రవర్తన చాలా మందికి నచ్చలేదు. అంతే కాకుండా షణ్ను, సిరి ప్రవర్తనపై దీప్తీ సునయన కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. యూట్యూబ్ వీడియోస్, బిగ్ బాస్3తో ఈ అమ్మడు ఎంతో మందికి సుపరిచితం. అలాగే షణ్ను, దీప్తీ కూడా ఐదు సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్నారు. ఇంత ఉన్నా హౌస్‌లో సిరితో కనెక్షన్ వస్తుందని షణ్ను చెప్పడంతో దీప్తీ హర్ట్ అయినట్టు తెలుస్తోంది. అలాగే వీరు బ్రేకప్ అవుతున్నట్టు కూడా పలు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ మధ్య కూడా దీప్తీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ‘కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు’ అని రాసుకొచ్చింది. ‘నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసినప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్‌ చేస్తున్నా’, ‘ఈ సంవత్సరం నాకేమీ బాగనిపించలేదు. కానీ చాలా నేర్చుకున్నాను..’ అంటూ వరుస పోస్టులు పెట్టింది. ఇది చూసిన వారందరూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనేమో అంటున్నారు. వీరిద్దరి మధ్య మనస్పర్దలు రాకుంటే దీప్తీ ఎందుకు ఇలా పెడుతోంది. వీరు బ్రేకప్ చెప్పుకునేలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed