కబడ్డీ ప్లేయర్‌‌గా ధ్రువ్ విక్రమ్

by Shyam |
కబడ్డీ ప్లేయర్‌‌గా ధ్రువ్ విక్రమ్
X

దిశ, వెబ్‌డెస్క్: చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్ ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ముందుగా ‘అర్జున్ రెడ్డి’ ‘ఆదిత్య వర్మ’గా తెరకెక్కగా సినిమా ఔట్ పుట్ శాటిస్‌ఫాక్షన్ ఇవ్వకపోవడంతో.. తండ్రి విక్రమ్ దగ్గరుండి మరీ మళ్లీ రీషూట్ చేయించాడు. కొడుకు ధ్రువ్‌ను ‘వర్మ’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హిట్ కొట్టించాడు. సినిమాలో ధ్రువ్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందగా.. సెకండ్ సినిమా పట్టాలెక్కుతోంది. ముందుగా లవ్ స్టోరితో వచ్చిన ధ్రువ్.. ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాతో వచ్చేస్తున్నాడు.

ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ మెడల్ అందించేందుకు శాయాశక్తులా కృషి చేసిన ఓ కబడ్డీ ప్లేయర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటించబోతున్నాడు. మరి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను డైరెక్టర్ పా.రంజిత్ నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన పా.రంజిత్ ..త్వరలో కాస్ట్ అండ్ క్రూ గురించి అప్‌డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story