- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో మూత పడిన సినిమా థియేటర్లను వెంటనే తెరిపించి తమను ఆదుకోవాలని తెలంగాణ సినిమా థియేటర్స్ కార్మిక సంఘం (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు ధర్నా నిర్వహించడంతో పాటు అధ్యక్షునికి వినతిపత్రం సమర్పించింది. అనంతరం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి పుల్లారావు, గౌరవ అధ్యక్షుడు ఎం మారన్న, ప్రధాన కార్యదర్శి కె అరుణ్, రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ లు మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా రెండవ పర్యాయం మూత పడిన థియేటర్లను తెరిపించాలని డిమాండ్ చేశారు. సినిమా హాళ్ల మూసివేత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాటిపై ఆధారపడి బతుకుతున్న 20 వేల మంది కార్మికులు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని, పూట గడవడం కూడా కష్టంగా మారిందని వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లను తెరిచేందుకు అనుమతినిచ్చినా.. యాజమాన్యాలు రీ ఓపెన్ చేయకుండా కాలయాపన చేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. కరోనా కారణంగా మొదటి విడత థియేటర్లు 9 నెలల పాటు మూత పడిన సమయంలో కొన్ని థియేటర్ల యాజమాన్యాలు కేవలం 20 నుండి 30 శాతం వేతనాలు ఇచ్చి చేతులు దులుపుకున్నాయని అన్నారు. అసలు జీతాలు ఇవ్వని సినిమాహాళ్ల యాజమాన్యాలు వేల సంఖ్యలో ఉన్నాయని అన్నారు. దీంతో వీటిల్లో పని చేసే వారు జీవనోపాధి లేక పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో వెంటనే థియేటర్లను తెరిపించేలా చర్యలు తీసుకోవాలని, లాక్ డౌన్ కాలానికి పూర్తి వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కోరారు .