- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అలాంటి పని చేసిన ఎమ్మెల్యే చల్లా.. వార్త రాసిన విలేఖరి.. ఆగ్రహంతో నేతలు ఏంచేశారంటే..?
దిశ, పరకాల: ఒక ప్రముఖ మీడియా విలేఖరి ఇంటిముందు టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించడం స్థానికంగా సంచలనం రేపుతోంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆత్మకూర్ మండల కేంద్రంలో తన కారుతో బతుకమ్మలను తొక్కించారని వార్త రాసిన విలేఖరి పొగాకు ప్రభాకర్ ఇంటిముందు శనివారం ఉదయం టీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ప్లకార్డులు ధరించి, విలేఖరి ప్రభాకర్ బయటికి రావాలని, పత్రికా విలేఖరిగా రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ఆ సమయంలో ప్రభాకర్ ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అంటూ పలువురు చర్చించుకోవడం గమనార్హం. ఈ నిరసన సుమారు మూడు గంటల పాటు మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులను తలపించింది. ఎస్ఐ రాజబాబు, తన సిబ్బందితో కలిసి పరిస్థితులు అదుపు తప్పకుండా టీఆర్ఎస్ నాయకులతో చర్చించి నిరసనను విరమించేలాచేశారు.
విలేఖరి ఇంటిపై దాడి గర్హనీయం:టీయూడబ్ల్యూజే
ఆత్మకూరు మండల కేంద్రంలో బతుకమ్మపై నుండి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి కారు వెళ్లిందన్న వార్త రాసిన విలేఖరి పొగాకు ప్రభాకర్ ఇంటిపై దాడిని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కార్యవర్గ సభ్యులు వి. వి రమణ తీవ్రంగా ఖండించారు.