విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

by srinivas |
విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
X

దిశ, ఏపీ బ్యూరో : జవాద్ తుపాను రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 11 తీర ప్రాంత మండలాల్లో తుపాను ప్రభావం ఉండవచ్చని ఐఎండీ స్పష్టం చేసిన నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇకపోతే సహాయక చర్యల నిమిత్తం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

తుపాను అనంతర చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. డ్రింకింగ్ వాటర్, విద్యుత్ పునరుద్ధరణపై సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్స్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కోవటానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed