ఆ ప్రాంతంలో వారికి ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుందే టీడీపీ.. ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్‌

by srinivas |
krishna das
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 29.18 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. అసెంబ్లీలో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 71,811 ఎకరాల భూ సేకరణ జరిగిందని వెల్లడించారు. పేదలకు సొంతిల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ ధ్యేయమని చెప్పుకొచ్చారు. కుల, మతాలకు అతీతంగా అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందన్నారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు టీడీపీ మోకాలడ్డుతోందని ఆరోపించారు.

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చారిత్రాత్మక పథకం. ఈ పథకానికి సహకరించకపోగా టీడీపీ అడ్డంకులు సృష్టించడం సరికాదని హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు దక్కకుండా అడ్డుకుంటున్నారని ఇది చాలా శోచనీయమన్నారు. సీఎం జగన్‌కు మంచి పేరు వస్తోందని టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. కోర్టు స్టేలు తెచ్చి.. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నారని మంత్రి కృష్ణదాస్‌ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed