‘మా జిల్లాను విడదీయవద్దు’

by srinivas |
‘మా జిల్లాను విడదీయవద్దు’
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల సంఖ్య పెరగనుందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాను విడదీయొద్దని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు కోరారు. జిల్లా విభజనపై తమ జిల్లా ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. పార్లమెంటు ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేయద్దని అన్నారు. అలా విభజిస్తే రాజకీయంగా దెబ్బతింటామని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జిల్లాల సంఖ్యను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన చెప్పడం కొసమెరుపు.

Advertisement

Next Story