రేపటి నుంచి ‘ధరణి’ శిక్షణా క్లాసులు

by Anukaran |   ( Updated:2020-10-09 08:31:09.0  )
రేపటి నుంచి ‘ధరణి’ శిక్షణా క్లాసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తొలి దశలో ‘ధరణి’ పోర్టల్ పై సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. శనివారం నుంచి 17వ తేదీ వరకు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. కొత్త ఆర్వోఆర్ చట్టం 2020లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకే చోట జరుగుతాయి. ఈ విషయంపైనే శిక్షణ ఉంటుంది.

తహసీల్దార్లకు, నాయబ్ తహసీల్దార్లకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఈ సాంకేతిక బృందమే సాయపడనున్నారు.ఈ క్రమంలో జిల్లా స్థాయిలోనే సాంకేతిక బృంద సభ్యులందరినీ వెంటనే రిలీవ్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వారంతా శనివారం ఉదయం 10గంటల్లోపు హైదరాబాద్‌లోని టెర్రా సీఐఎస్ టెక్నికల్ టీంకు రిపోర్టు చేయాలని సూచించారు.


Advertisement
Next Story

Most Viewed