29న ధరణి పోర్టల్ ప్రారంభం..

by Shyam |
29న ధరణి పోర్టల్ ప్రారంభం..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్ ఈనెల 29న ప్రారంభం కానుంది. ముందుగా దసరా పండుగ రోజున ఈ పోర్టల్‌ను తీసుకురావాలని భావించినా.. కొన్ని అనివార్య కారణాల వలన సీఎం కేసీఆర్ 29 తారీఖు మధ్యాహ్నం 12.30 గంటలకు అధికారికంగా ప్రారంభంచనున్నారు.

ఇకపై రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను ధరణి వెబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్‌లో భద్రపరచనున్నారు. ఈ పోర్టల్‌లో పొందుపరిచిన భూముల వివరాలు గోప్యంగా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా ధరణి వలన రాష్ట్ర వ్యాప్తంగా భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అవుతాయని పేర్కొంది.

Advertisement

Next Story