ధనుష్.. బన్నీ రికార్డును బ్రేక్ చేస్తాడా?

by Shyam |
ధనుష్.. బన్నీ రికార్డును బ్రేక్ చేస్తాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా అంటే అభిమానుల్లో క్రేజ్ మామూలుగా ఉండదు. వారిద్దరి కాంబినేషన్‌లో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘అల వైకుంఠపురంలో’ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి పాటలు కూడా ప్రధాన కారణం. ‘సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మ, ఓ మై గాడ్ డాడీ.. ఇలా ఈ సినిమాలోని ప్రతి పాట దేనికదే స్పెషల్. సినిమా విడుదలకు ముందే పాటలన్నీ కూడా చార్ట్ బస్టర్స్‌గా నిలిచి సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. ఈ చిత్రంలోని అన్ని పాటలు కలిపి ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడా రికార్డుకు కోలీవుడ్ హీరో ధనుష్ అతి చేరువలో ఉన్నాడు.

ఈ సినిమాలోని మూడు లిరికల్ సాంగ్స్ ఒక్కోటి యూట్యూబ్‌లో ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయగా.. వీడియో సాంగ్స్‌కు 50 మిలియన్ వ్యూస్ దాటాయి. మొత్తంగా అన్ని వెర్షన్ పాటలు కలిపి ‘వన్ బిలియన్ వ్యూస్’ మార్క్‌ను అందుకున్న తొలి తెలుగు చిత్రంగా ‘అల వైకుంఠపురంలో’ నిలిచింది. దీంతో బన్నీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. అయితే తాజాగా ఈ రికార్డుకి చేరువలో ధనుష్ సినిమా ఉండటం విశేషం. ధనుష్ – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘మారి 2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాట ఒక్కటే ఇప్పటి వరకు అన్ని వెర్షన్స్ కలిపి 844 మిలియన్ వ్యూస్‌తో యూ ట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇక చిత్రంలోని అన్ని పాటలు కలిసి సాధించిన వ్యూస్‌ని యాడ్ చేస్తే 999 మిలియన్ దాటింది. ఇంకో మిలియన్ వ్యూస్ వస్తే ‘మారి-2’ ఆల్బమ్ కూడా ‘వన్ బిలియన్ వ్యూస్’ రికార్డును అందుకుంటుంది. మరి బన్నీ రికార్డును.. ధనుష్ బ్రేక్ చేస్తాడా? లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఏదేమైనా.. ‘వన్ బిలియన్ వ్యూస్’ రికార్డు మొట్టమొదట అందుకుంది మాత్రం ‘అల వైకుంఠపురంలో’ మూవీనే.

Advertisement

Next Story