సెకండ్ డోస్ తీసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి

by Shyam |
DGP Mahender Reddy
X

దిశ, అంబర్‌పేట: కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం వేయించుకున్నారు. ఇటీవలే తిలక్‌నగర్ పీహెచ్‌సీ మొదటి డోస్ తీసుకున్న ఆయన తాజాగా అంబర్‌పేట్‌లో సీసీఎల్‌లోని పోలీస్ వైద్యశాలలో రెండో డోస్ తీసుకున్నారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని సూచించారు. ఇంతవరకు ఎంత మంది పోలీసు అధికారులు వ్యాక్సిన్ వేయించుకున్నానే వివరాలపై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. కార్యక్రమంలో డీసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్స్ వెంకటరమణ, మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed