సోషల్ మీడియా పోస్టింగులపై ప్రత్యేక నిఘా

by Shyam |
సోషల్ మీడియా పోస్టింగులపై ప్రత్యేక నిఘా
X

దిశ, వెబ్‎డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని విధ్యంసక శక్తులు మత కల్లోలాలకు కుట్రలు చేస్తున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టింగులపై ప్రత్యేక నిఘా పెట్టామని స్పష్టం చేశారు. తప్పుడు పోస్టింగులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

51 వేల మందితో జీహెచ్ఎంసీ ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహిస్తామన్న నమ్మకం ఉందన్నారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేశామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed