- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. డీజీపీ కీలక సూచన

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చిన్నారి చైత్రను రాజు అనే కిరాతకుడు హత్యాచారం చేశాడు. ఈ ఉదంతం బయటకు తెలియడంతో రాజు తప్పించుకొని తిరుగుతున్నాడు. ప్రస్తుతానికి రాజు కోసం తెలంగాణ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అతడి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. గాలింపు చర్యలో భాగంగా పోలీసులు.. నిందితుడు రాజు స్వగ్రామం కొడకండ్ల(జనగామ జిల్లా)పై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రజలను సైతం పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ హైవేలపై పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా ఏపీ-తెలంగాణలో బోర్డర్‌లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Next Story