స్నేహితుడి కళ్ల ముందే యువతిపై గ్యాంగ్ రేప్.. డీజీపీ షాకింగ్ కామెంట్స్

by srinivas |   ( Updated:2021-06-21 02:31:55.0  )
DGP-Gautam-sawang comments on Gang Rape Case
X

దిశ, వెబ్‌డెస్క్ : అమరావతి సీతానగరంలో బ్లేడ్‌బ్యాచ్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. కృష్టా నదీ తీరంలో స్నేహితుడితో కలిసి వెళ్తున్న ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువకుడి కాళ్లు చేతులు కట్టేసి.. యువతిపై లైంగిక దాడి చేశారు. అనంతరం పడవలో విజయవాడవైపు పారిపోయారు. ఈ దారుణ ఘటనపై ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు.

యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటన్నట్టు తెలిపారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్లకు గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి అమానవీయ చర్యలను ఉపేక్షించేది లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతీ మహిళ దిశ యాప్ కచ్చితంగా వాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అయితే.. గుంటూరు, విజయవాడ మధ్య బ్లేడ్ బ్యాచ్ తిరుగుతూ ఒంటరిగా కనిపించిన వారిపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు తాడేపల్లి రౌడీషీటర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. టవర్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story