రాధని ప్రాణంలా ప్రేమించిన కృష్ణుడు పెళ్లి ఎందుకు చేసుకోలేకపోయాడు.. కారణం ఇదే!

by Prasanna |
రాధని ప్రాణంలా  ప్రేమించిన కృష్ణుడు పెళ్లి ఎందుకు చేసుకోలేకపోయాడు.. కారణం ఇదే!
X

దిశ, ఫీచర్స్: ఎన్ని యుగాలు మారిన ప్రేమ మాత్రం ఎప్పటికి మారదు. ఈ భూమిపై మనుషులు ఉన్నంత కాలం ప్రేమ ఉంటుంది. ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు మనందరికి వెంటనే రాధ గుర్తొస్తుంది. అయితే రాధని ప్రాణంలా ప్రేమించిన కృష్ణుడు చివరి వరకు ఎందుకు లేడో అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఇక్కడ దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

బృందావనంలో కృష్ణుడు ఎప్పుడూ గోపికలతోనే ఉంటాడు. కానీ రాధ అక్కడ లేదు. బృందావనంలో రాధ లేదు. ఆమె సమీపంలోని రేపల్లెలో నివసించేది. కృష్ణుడి కంటే రాధ 10 ఏళ్లు పెద్దది అయినప్పటికీ వయసు వారి ప్రేమను ఆపలేదు. కంసుడు కృష్ణుడిని మధురకి తీసుకురమ్మని ఆక్రుడుని బృందావనంకి పంపుతాడు. అప్పుడు గోపికలందరూ మీరు వెళ్లడానికి వీల్లేదంటూ ఏడుస్తూ చెబుతారు.

అయితే, చివరికి కృష్ణుడు వారి నుంచి తప్పించుకుని రేపల్లెకు వెళ్తాడు. ఐదు నిమిషాలు అక్కడే ఉంటాడు. అప్పుడు రాధ, కృష్ణ ఇద్దరూ మౌనంగా ఉంటారు. వారి మధ్య మాటలు కూడా ఉండవు.. అతను ఎందుకు వెళ్లిపోవాలో ఆమెకు కూడా తెలుసు. చివరగా కృష్ణుడు బలరామునితో బయలుదేరాడు. అతను కంసుడిని చంపుతాడు. కొంతకాలం తర్వాత, అతను శిశుపాలుడిని కూడా చంపుతాడు, అలాగే కృష్ణుడు ఇతర రాక్షసులను కూడా చంపుతాడు.

వీర్జతో కలిసి ఉన్న శ్రీకృష్ణుడిని చూసి రాధ తట్టుకోలేకపోతుంది.. దీనితో వీర్జ నదిగా మారిందని కథలు చెబుతున్నాయి. ఆ తర్వాత రాధ మనసు విరిగిపోయి కృష్ణుడికి దగ్గరయ్యేందుకు నిరాకరించిదట. కృష్ణుడి మిత్రుడైన సుధాముడు రాధని ఒప్పించాలని చూశాడు.. కానీ రాధ ఒప్పుకోలేదు.. అప్పుడు సుధాముడు ఈ జన్మలోనే కాదు.. మరు జన్మలో కూడా నీవు కోరిన వాడిని పెళ్లి చేసుకోలేవని శపించినట్టు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. ఇలా వారి ప్రేమ బంధం మధ్యలోనే తెగిపోయింది. ఇక కృష్ణుడు మధురని ఒక కొలిక్కి తీసుకొచ్చి, అక్కడి నుంచి ద్వారకకి వెళ్ళిపోయాడని పురాణాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed